మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

*** నిరంతరం విధి నిర్వహణలో బిజీ గా ఉంటూనే సొంత నిధులతో సేవాకార్యక్రమాలు.

ఏపీ వాయిస్ టుడే.. అమరావతి.

ప్రార్థించే పెదవులు కన్నా... సహాయం చేసే చేతులే మిన్న అనే సూక్తిని నరనరాల్లో జీర్ణించుకుపోయి ప్రతీ రోజు ఎంతో మందికి ఏదోవిధంగా సహయం చేయనదే నిద్రపోని మరో మదర్ థెరీసా చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.తాను ఎక్కడ విధులు నిర్వహిస్తున్నా అనాదులను అభాగ్యులను , నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తారు పద్మావతి.తల్లిదండ్రులకు దూరంగా వసతిగృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక అమ్మగా వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఏం కావాలన్నా అందిస్తున్నారు పద్మావతి. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వెంటనే నేనున్నాంటూ ముందుకు వెళ్ళి అన్ని విధాలా అందుకుంటున్నారు ఆమె.గతంలో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించినప్పుడూ కూడా ఎంతో మంది పేదలకు తన ఆపన్నహస్తం అందించారు పద్మావతి. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వెంటనే వాళ్ళకు పద్మావతి మేడమ్ గుర్తుకొస్తారు.ఎందుకంటే ఆమె మాత్రమే వారి కష్టాన్ని ఒక అమ్మలా అర్దం చేసుకొని వారికి అన్నివిధాలా అండగా ఉంటారు గనుక.

మా పద్మావతి అమ్మ ఉంటే చాలు మాకు కొండంత దైర్యం అని అక్కడ ప్రజలు అంటుండం విశేషం. నిరంతరం ఎంతో మందికి సహాయసహకారాలు అందిస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న పద్మావతి గారు ఈ కార్యక్రమాలన్నీ తన సొంత ఖర్చుల తో చేబడుతుండడం విశేషం. ఎదుటి వారికి సహాయం చేస్తే ఏమెస్తుందని ఆలోచించే వారున్న ఈ రోజుల్లో మానవ సేవే మాధవ సేవ అని భావించి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పద్మావతి గారిని ఎంతో మంది అభినందిస్తున్నారు.

దేవుడు ఎలా ఉంటాడో చూడలేదు కానీ మా పద్మావతి అమ్మను చూస్తుంటే కనిపిస్తున్న దైవం లా ఉందని ఎంతో మంది అంటుండడం విశేషం. ఒక ప్రక్క చక్కగా విధులు నిర్వహిస్తూ చక్కని వైద్యసేవలను అందిస్తూనే,మరో పక్క నిరంతరం సేవాకార్యక్రమాలు లో మునిగి తేలుతున్న పద్మావతి గారు ఇటీవల ఉత్తమ మహిళా అధికారి అవార్డు సైతం అందుకోవడం విశేషం.విద్యార్ధులకు కావాల్సిన వస్తువులు అందిస్తూ, ఎంతో మంది పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తూ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఆర్దిక సహాయం అందిస్తూ వారి కళ్లలో ఆనందం చూస్తూ మురిసిపోతున్నారు పద్మావతి మేడమ్. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఎంతో మందికి సంపూర్ణ వైద్యం అందిస్తూ ఆరోగ్యవంతులుగా తీర్చిద్దుతున్నారు పద్మావతి.అంతేకాదు అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడతుండడం విశేషం. ఎలాంటి స్వార్థం లేకుండా నిశ్వార్దంగా సేవలందిస్తున్న చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింట

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే