ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.ఎమ్మెల్యేరాజు

*చోడవరంలో ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు* *చోడవరం, AP VOICE TODAY, జూలై 20:* ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు అన్నారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో ఆయా అంశాలపై చర్చించారు. త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వినతులు తీసుకువచ్చిన వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగానే ప్రతి సోమవారం, శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు. ఆయా సమస్యలను అవకాశం ఉన్నంతవరకు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని, మిగిలిన వాటిని జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక ద్వారా అధికారులు సమస్యలను పరిష్కరిస్తున్నారని ఆయన తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.

చోడవరం లో స్వచ్చ ఆంధ్ర, స్వర్ణాంధ్ర