పోలంబడి పై అవగాహన

కొయ్యూరులో రైతులకు అవగాహన కార్యక్రమం

కొయ్యూరు, జూలై 21 (AP VOICE TODAY)

కొయ్యూరు రైతుల అవగాహన కార్యక్రమం

ప్రస్తుత కాలంలో గ్రామాల్లో రైతులు వేసుకున్న వరి నర్సరీలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి శివ రాంప్రసాద్ రైతులకు అవగాహన కల్పించారు.

మేరకు కొయ్యూరు మండలంలోని చిట్టింపాడు, రామన్నపాలెం గ్రామాల్లో రైతులకు పాలంబడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు వర్షాధార పంట వేసుకోవడం వల్ల యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని రైతులకు సూచించారు.

చిరు ధాన్యాలు అయిన రాగి, సజ్జ సాగును పెంపొందించడంపై అవగాహన కల్పించడంతో పాటు, స్వయంమేవ యాప్ ద్వారా రైతులు యూరియా, డీఏపీ తీసుకునే విధానంపై సూచనలు చేశారు.

ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల పంట నష్టం జరిగితే పరిహారం పొందటానికి రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహాయ అధికారి శాంక్ రైతులతో కలిసి పాల్గొన్నారు.

- AP VOICE TODAY

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.

చోడవరం లో స్వచ్చ ఆంధ్ర, స్వర్ణాంధ్ర