రేపే పెన్షన్లు పంపిణీ
ఏపీ వాయిస్ టుడే అమరావతి
అనకాపల్లి: రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ
📍 అనకాపల్లి | 📅 జూలై 29, 2026
అనకాపల్లి జిల్లాలో రెండు రోజుల ముందే సామాజిక పింఛన్లను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
2.51 లక్షల మందికి లబ్ధి
జిల్లాలో 2,51,357 మంది లబ్ధిదారులకు ఈనెల 30వ తేదీన పంపిణీ చేయడానికి రూ.107.14 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
లబ్ధిదారులు అందరూ ఇళ్ల వద్ద ఉండి పింఛన్లు అందుకోవాలని అధికారులు కోరారు.
- ఏపీ వాయిస్ టుడే అమరావతి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి