రోలుగుంట మహిళకు కోవిడ్.

ఏపీ వాయిస్ టుడే, రోలుగుంట

రోలుగుంట మహిళకు కరోనా పాజిటివ్.. కేజీహెచ్ పరీక్షల్లో నిర్ధారణ

హోం ఐసోలేషన్‌కు రిఫర్.. స్వల్ప లక్షణాలుండడంతో ఇంటికే పంపించారు

రోలుగుంట: మండల కేంద్రం రోలుగుంటకు చెందిన 58 ఏళ్ల మహిళకు కరోనా సోకింది.

స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డా. శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం... రోలుగుంటలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ ఈ నెల 24వ తేదీన విశాఖపట్నంలో కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత జ్వరం, దగ్గు రావడంతో ఆమెను కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.

కరోనా లక్షణాలు ఉండడంతో అక్కడే పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు విశాఖ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్ తెలిపారని స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డా. శ్రావణి ఆదివారం చెప్పారు.

స్వల్ప లక్షణాలుండడంతో ఆమెకు మందులిచ్చి హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఇంటికి పంపించారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, విశాఖలోనే వైద్య సేవలందిస్తున్నారని వైద్యాధికారి చెప్పారు.

ఈ నేపథ్యంలో రోలుగుంట మండలంలో అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పీహెచ్‌సీని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

- ఏపీ వాయిస్ టుడే రిపోర్టర్, రోలుగుంట

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే