ఏడీ సస్పెండ్

కఠిన చర్యలు

అనకాపల్లి మైనింగ్ AD సస్పెండ్

(అనకాపల్లి)

అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ఆరోపణలపై అనకాపల్లి జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పై ప్రభుత్వం వేటు వేసింది.

రాంబిల్లి మండలం పంచదార్ల రెవెన్యూ పరిధిలోని ఉమాధర్లింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో పరిమితికి మించి మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై విచారణ జరిపిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, మైనింగ్ చట్టాల అమలులో వైఫల్యం వంటి ఆరోపణలతో జిల్లా గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మజ్జి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ శాఖ డైరెక్టర్ బాలచంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలో ఆయన బాధ్యతలను అసిస్టెంట్ జియాలజిస్టుకు ఇన్-ఛార్జిగా అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఇకపై ఉక్కుపాదం మోపుతుందని అధికారులు హెచ్చరించారు.

AP VOICE TODAY

నిజమైన వార్త - మీ గొంతు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే