స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్ నిషాంతి.

📍 AP Voice Today పాడేరు, జూలై 25: ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించే అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహణకు సంబంధించిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేడుకల్లో చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖలకు చెందిన అధికారులు సమన్వయంగా వ్యవహరించి ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించి, చక్కని ఫలితాలు సాధించిన అధికారులు, ఉద్యోగులకు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో తగిన రీతిలో సత్కరిస్తామన్నారు. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఏఎస్ఆర్ అంటే... అడాప్ట్, షో కేస్, రిప్లికేషన్ అనే భావనతో ప్రతి ప్రభుత్వ శాఖ ఇప్పటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రత్యేకంగా కృషి చేసి అత్యున్నత ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. – AP Voice Today | అల్లూరి సీతారామరాజు జిల్లా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

వజ్రగడ లో ఘణంగా పీటీఎం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే