అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాలు
*ఏపీ వాయిస్ టుడే*
*బియ్యం సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి*
*లోపాలుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరిక*
అనకాపల్లి, జూలై 22: జిల్లాలోని కళాశాలలు, హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యంలో పురుగులు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్‌లో బుధవారం స్టీరింగ్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గుడ్డు పరిమాణం 50 గ్రాములకు తక్కువ కాకుండా ఉండాలన్నారు. చిన్న సైజు గుడ్డు సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చెక్కిలు నాణ్యతతో పాటు ప్యాకింగ్‌లో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు.
వైద్యశాఖ అధికారులు విద్యార్థులకు నెలలో ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. యాప్లో విద్యార్థుల వివరాలను నమోదు చేసి రక్త హీనతతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి ముందులు అందించాలన్నారు.
ఈ నెల 24న విద్యాలయాల్లో జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలకు (పీటీఎం) ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి తప్పులు దొర్లినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, సిబ

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి