అనకాపల్లి జిల్లా బిసీ సంక్షేమ శాఖ అధికారిణి శ్రీదేవి
AP VOICE TODAY - అనకాపల్లి జిల్లా ఎడిషన్
ఏపీ వాయిస్ టుడే
తేదీ: జులై 31, 2025 | గురువారం
హాస్టల్ అవకతవలపై ఉక్కుపాదం
చీడికాడ BC బాలికల హాస్టల్ పై సంచలన విచారణ
చీడికాడ BC బాలికల హాస్టల్ లో కొంతకాలంగా కొనసాగుతున్న అవకతవలు, అక్రమాలపై జిల్లా BC సంక్షేమ శాఖ అధికారిణి కె.శ్రీదేవి స్వయంగా రంగంలోకి దిగి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
బాలికలకు అమలు కాని మెనూ, సిబ్బంది దురుసు ప్రవర్తన, బాలికలతో బాత్ రూములు, మరుగుదొడ్లు కడిగించడం వంటి తీవ్రమైన ఫిర్యాదులు ఏప్రిల్ నెలలో అందాయి. జిల్లా స్పందనలో ఫిర్యాదుతోపాటు వీడియోకాల్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ సమస్య వెళ్లింది.
దీంతో వెంటనే స్పందించిన శ్రీదేవి గారు జాయింట్ కలెక్టర్, ఆర్ డి ఓ లతో కలిసి చీడికాడ హైస్కూల్ లోను, హాస్టల్ లోను రెండు దఫాలుగా సుదీర్ఘంగా విచారణ నిర్వహించారు.
విచారణలో వాస్తవాలు నిర్ధారణ కావడంతో ఈ విషయంలో వంట సిబ్బందిని వేరొక హాస్టల్ కు బదిలీ చేసి, అప్పటి వార్డెన్ ఎం.ఈ.ఓ ను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకున్నారు.
పేద బాలికలకు అండగా అధికారిణి శ్రీదేవి
పేద బాలికల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న జిల్లా BC సంక్షేమ శాఖ అధికారిణి కె.శ్రీదేవి గారు ఈ కేసులో ఎంతో బాధ్యతగా, నిబద్ధతతో వ్యవహరించారు. బాలికల సమస్యలను స్వయంగా తెలుసుకుని, ఎవరి ప్రమేయం లేకుండా నిష్పాక్షికంగా విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకున్నారు. దీంతో స్థానికులు, బాలికల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి గారి చర్యను అందరూ అభినందిస్తున్నారు.
విచారణకు వచ్చిన అధికారుల బృందం
గురువారం సాయంత్రం 4 గంటలకు జిల్లా BC సంక్షేమ శాఖ అధికారిణి కె.శ్రీదేవి గారితోపాటు డ్వామా పి డి నిర్మలాదేవి, డి ఆర్ డి ఏ పి డి శశీదేవి, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా డి ఐ ఓ చంద్రశేఖర్, కె.కోటపాడు సి ఐ కిలపర్తి కృష్ణ, నోడల్ హెడ్మాస్టర్ డివరహమూర్తి, డి టి సింహాద్రి లు హాస్టల్ కు వచ్చారు.
ముందుగా బాలికలతో, అనంతరం వార్డెన్ లలిత, వంట సిబ్బందితో విడివిడిగా మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఈ విచారణ నివేదికను అనకాపల్లి ఆర్ డి ఓ ద్వారా కలెక్టర్ గారికి అందజేస్తామని అధికారిణి కె.శ్రీదేవి గారు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని హాస్టళ్లపై కఠిన నిఘా ఉంటుందని హెచ్చరించారు.
AP VOICE TODAY -

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి