కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.
📰 AP VOICE TODAY 📰
పేదలకు దేవుడులా అండగా నిలిచిన కలెక్టర్ నిశాంతి
పాడేరు రూరల్, ఆగస్టు 5:
అధికారం చేతిలో ఉంటేనే కాదు, మనిషికి మనసుంటే పేదల కష్టాలకు ఎలా స్పందించాలో చూపించారు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి. ఒక పేద మహిళ కన్నీళ్లను తుడిచి, ఆమె జీవితానికి కొత్త బాట వేసి అధికారులందరికీ ఆదర్శంగా నిలిచారు.
ముంచంగిపుట్టు మండలం బాబుసాల పంచాయతీకి చెందిన ఆర్. నాగమణి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ పోషణ భారంతో బాధపడుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తన గోడును వినతిపత్రం రూపంలో విన్నవించారు.
కలెక్టర్ నిశాంతి: "ఇలాంటి పేదలకు వెంటనే అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది" అంటూ డిఎల్‌పిఓ పి.ఎస్. కుమార్కు ఫోన్ చేసి తక్షణమే ఉపాధి కల్పించాలని ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలను శిరసావహించిన డిఎల్‌పిఓ పి.ఎస్. కుమార్ అత్యంత వేగంగా స్పందించారు. నాగమణిని క్లాస్ మిత్రగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారిక ప్రక్రియలను సైతం పక్కనపెట్టి మానవత్వానికి పెద్దపీట వేసిన వీరి తీరు జిల్లా వ్యాప్తంగా ప్రశంసల వెల్లువ తెప్పిస్తోంది.
ఆ ఉత్తర్వులను కలెక్టర్ నిశాంతి స్వయంగా నాగమణి చేతికి అందించి, "ధైర్యంగా ఉండు. ప్రభుత్వం నీకు తోడుగా ఉంటుంది" అంటూ ధైర్యం చెప్పారు. ఉపాధి లభించడంతో నాగమణి కలెక్టర్ నిశాంతి, డిఎల్‌పిఓ పి.ఎస్. కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.
ప్రజా సమస్యలపై ఇంతటి చొరవతో పనిచేస్తున్న కలెక్టర్ నిశాంతి, వెంటనే స్పందించిన డిఎల్‌పిఓ పి.ఎస్. కుమార్ చర్యలు అందరికీ ఆదర్శప్రాయం. వారి ఈ మానవీయ సేవ వల్ల నేడు ఒక కుటుంబంలో కొత్త ఆశలు చిగురించాయి.
_- AP VOICE TODAY, పాడేరు బ్యూరో -_

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి