డి ఎం హెచ్ ఓ సస్పెన్షన్
AP VOICE TODAY
అల్లూరి సీతారామరాజు జిల్లా DMHO సస్పెండ్
అనధికార డిప్యుటేషన్లు, విధి నిర్లక్ష్యం ఆరోపణలపై చర్యలు
పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అనధికారిక డిప్యుటేషన్లు, ఉద్యోగుల వేధింపులు, పరిపాలనా విధానాల ఉల్లంఘన, ఇతర అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
రిపోర్టర్: AP VOICE TODAY

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి