యువతా .. నిరాశ వదిలి కృషి చేయి.. ఇలా ఉన్నత స్థాయి కి చేరుకో..
జూలై 26, 2026
ఏపీ వాయిస్ టుడే, కాకినాడ
యువతా మేలుకో... నిరాశ వదిలి కృషి చేయి... ఇలా ఉన్నత స్థాయి కి చేరుకో.
పేదింట్లో విద్యా కుసుమం.. రూ.1.06 కోట్ల జీతంతో ఉద్యోగం
చెవిటి, మూగ తండ్రి కష్టం వృధా కాలేదు.. కెనడా కంపెనీలో అఖిలేష్‌కు ఆఫర్
కాకినాడ: సరైన లక్ష్యం ఉంటే పేదరికంలోనూ అద్భుతాలు చేయొచ్చని మార్చి అఖిలేష్ నిరూపించారు.
కాకినాడ జిల్లా కుతుకుడుమిల్లికి చెందిన ఆయన తండ్రి చెవిటి, మూగ. ఆయన టైలర్ పని చేస్తూ ఎంతో కష్టపడి కుమారుడికి మంచి విద్యను అందించారు.
అఖిలేష్ కూడా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి డేటా సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూలో 1.06 కోట్ల వార్షిక వేతనంతో కెనడా కంపెనీలో ఉద్యోగాన్ని సాధించారు.
పేదరికమే అడ్డు కాదని, కష్టపడి చదివితే ఏ స్థాయికైనా వెళ్లొచ్చని అఖిలేష్ యువతకు సందేశం ఇస్తున్నారు. ఆయన సక్సెస్ స్టోరీ ఇప్పుడు జిల్లా అంతా చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు అఖిలేష్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు కూడా కుమారుడి విజయంపై గర్వంగా ఉన్నారు.
- ఏపీ వాయిస్ టుడే రిపోర్టర్, కాకినాడ

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి