ఇది కదా.. స్నేహం అంటే.
AP VOICE TODAY
Andhra Pradesh & Telangana Latest News
స్నేహమంటే ఇదేరా..!
ఒకే బ్యాచ్, ఒకే జాబ్ - 3గురు స్నేహితులకు TGSRTC డ్రైవర్ ఉద్యోగాలు
33 ఏళ్ల స్నేహానికి ప్రభుత్వ ఉద్యోగంతో పట్టాభిషేకం
తేదీ: 10-08-2026 | రిపోర్టర్: AP VOICE TODAY
08-07-1991. ఈ రోజున రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామంలో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒకే బడిలో చేరిన వారు మిత్రులయ్యారు.
చదువయ్యాక డ్రైవింగ్ వృత్తిని ఎంచుకొని ఒకేచోట పనిచేసేవారు. ఇప్పుడు ఒకే నోటిఫికేషన్‌లో ముగ్గురూ సర్కారు కొలువు సాధించి స్నేహమంటే మాదే.. అని నిరూపించారు.
వారే నిదురం చెన్నయ్య యాదవ్, ఉప్పు శివకుమార్, శ్రీశైలం గౌడ్. డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్‌లోని భారత్ పెట్రోలియం సంస్థలో డ్రైవర్లుగా పనిచేస్తూ... ఒకే కాలనీలో నివాసం ఉంటున్నారు. TGSRTC చేపట్టిన నియామకాలకు దరఖాస్తు చేసుకున్నారు.
ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ముగ్గురూ డ్రైవర్లుగా ఎంపికవడంతో సంతోషంలో మునిగిపోయారు.
శివకుమార్, చెన్నయ్య, శ్రీశైలం గౌడ్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి