జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆదేశం
ఏపీ వాయిస్ టుడే, అనకాపల్లి జిల్లా బ్యూరో
అనకాపల్లి, ఆగస్టు 15: అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.
డీఆర్వో వై. సత్యనారాయణరావుతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరై వినతులు తీసుకున్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి