మోడరన్ కాలేజీ సత్తా
AP VOICE TODAY
ఫలితాలతో సత్తా చాటిన మోడరన్ డిగ్రీ కళాశాల
- విద్యార్థుల విజయాల వెనుక కరస్పాండెంట్ డా. లయన్ జి.వి.రావు కృషి అపూర్వం
రామచంద్రపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా:
విద్యార్థుల భవిష్యత్తుకే అంకితమైన ఒక విద్యా సంస్థకు నిజమైన సారథి ఎలా ఉంటారో మోడరన్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డా. లయన్ జి.వి.రావు నిరూపిస్తున్నారు.
బుధవారం విడుదలైన ఆదికవి నన్నయ యూనివర్సిటీ నాలుగవ సెమిస్టర్ డిగ్రీ ఫలితాల్లో లయన్ జి. వి. రావు మోడరన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కరస్పాండెంట్ డాక్టర్ లయన్ జి.వి.రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
విద్యార్థుల ప్రతిభకు కరస్పాండెంట్ మార్గదర్శకత్వమే కారణం
డా. జి.వి.రావు గారి దూరదృష్టి, క్రమశిక్షణ, విద్య పట్ల నిబద్ధత వల్లే ప్రతి సెమిస్టర్‌లో కళాశాల జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని అధ్యాపకులు, విద్యార్థులు కొనియాడుతున్నారు.
బీఎస్సీలో
- టి. శాంతి స్వరూప - 9.6 GPA
- సి.హెచ్. అలేఖ్య - 9.4 GPA
- సి.హెచ్. శ్రీ లలిత - 9.2 GPA
- కె. రామలక్ష్మి - 9.0 GPA
మొత్తం 14 మంది విద్యార్థులు ఈ కోర్స్ నందు 8.5 కంటే ఎక్కువ GPA సాధించినట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా బీఎస్సీ జువాలజీ నందు
- పి. దివ్య - 9.4 GPA
- జయ శ్రీ సత్య - 9.0 GPA
- కె. చంద్రకళ - 9.0 GPA
బి.కామ్ నందు పి. తులసి జగదీశ్వరి - 8.6 GPA
బిసిఏ నందు యు.సాయి అనిత - 8.5 GPA సాధించినట్లు వెల్లడించారు.
అనంతరం ప్రిన్సిపల్ పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పటిష్ట వార్షిక ప్రణాళిక, అత్యుత్తమ బోధన ద్వారా ప్రతి సెమిస్టర్ నందు తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్న నాయకత్వం
ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధినేత జి.వి.రావు, ప్రిన్సిపాల్ పి వెంకటేశ్వర్లు, అకాడమిక్ డైరెక్టర్ కె.సాయిరాం చౌదరి, డిగ్రీ కళాశాల సిబ్బంది అభినందించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తున్న డా. లయన్ జి.వి.రావు గారి సేవలు నిజంగా అభినందనీయం.
- నిజం చెపుతాం న్యూస్, రామచంద్రపురం జిల్లా బ్యూరో - ఆగష్టు 5


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి