ముంచంగిపుట్టు లో ఘణంగా ఆదివాసీ దినోత్సవం.


 *AP VOICE TODAY*


*ముంచంగిపుట్టులో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం*  

*గిరిజన హక్కుల పరిరక్షణకు అందరూ ఏకం కావాలి - ఎమ్మెల్యే

 రేగం మత్స్యలింగం*  

*జీవో నంబర్ 3 పునరుద్ధరణ, 1/70 చట్టం కఠిన అమలుకు డిమాండ్*


*ముంచంగిపుట్టు:* అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముంచంగిపుట్టులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, కుంభ రవిబాబు, అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర హాజరయ్యారు.


కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలే విగ్రహాలను ఆవిష్కరించి, నివాళులర్పించారు.


ఈ సందర్భంగా *ఎమ్మెల్యే  రేగం.మత్స్యలింగం* మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, సంక్షేమే అందరి లక్ష్యం కావాలని ఆయన అన్నారు.


*జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర* మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కుల కోసం ఆదివాసీ బిడ్డలు పోరాడాలని అన్నారు. గిరిజన ప్రాంతంలో అన్ని హక్కులు ఆదివాసీలకే దక్కుతాయని, ఇక్కడి ఖనిజ సంపద, అటవీ సంపద, ఆస్తులన్నింటిపై సర్వాధికారాలు ఆదివాసీలకే ఉన్నాయని స్పష్టం చేశారు. నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందేలా జీవోను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.


*ఎమ్మెల్సీ కుంభ రవిబాబు* మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాలను ప్రభుత్వం గుర్తించి, సమావేశాలతో కాలక్షేపం చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.


*అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి* మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3 రద్దుతో గిరిజనులు భారీగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలని, గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.


*మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి* మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాల అమలులో ప్రభుత్వం, అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. గిరిజన భూములను బడాబులకు అప్పగించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఆదివాసీ దినోత్సవం రోజైనా జీవో నంబర్ 3పై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని, కానీ లేనిపోని సాకులతో గిరిజనులను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు.


*కార్యక్రమంలో పాల్గొన్నవారు*  

ఈ కార్యక్రమంలో అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీపీ అరిసెల సీతమ్మ, వైస్ ఎంపీపీలు సత్యనారాయణ, భాగ్యవతి, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, వైఎస్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు బాబురావు, వివిధ పార్టీల నేతలు రమేష్, బాబురావు, సూరయ్య, సన్యాసిరావు, త్రినాథ్, మూర్తి, గాసిరావు, అప్పాలు, రఘునాథ్, నానిబాబు, సుభాష్, అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గిరిజనులు పాల్గొన్నారు.


*––– AP VOICE TODAY –––*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే