రికవరీ ఏజెంట్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేసిన ఆర్ బి ఐ
రికవరీ ఏజెంట్ల అరాచకాలకు చెక్.. RBI కఠిన నిర్ణయాలు
లోన్ యాప్‌లు, బ్యాంకు రికవరీ ఏజెంట్ల అరాచకాలకు అడ్డుకట్టవేసేలా RBI కఠిన నిర్ణయాలు తీసుకుంది.
రుణ వసూళ్ల పేరుతో ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్లు చేయకూడదని స్పష్టం చేసింది. '8AM-7PM మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. బెదిరించడం, దూషించడం చేయరాదు. ఇంటికి వచ్చే ముందు కచ్చితంగా సమాచారం ఇవ్వాలి.
ఉల్లంఘనలకు బ్యాంకులదే బాధ్యత' అని తెలిపి చెప్పింది. కొత్త రూల్స్ 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.
- ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకు మాత్రమే కాల్స్
- బెదిరింపులు, దూషణలకు నో
- ఇంటికి వచ్చే ముందు ముందస్తు సమాచారం
- రూల్స్ ఉల్లంఘిస్తే బ్యాంకులపైనే చర్యలు
––– ఏపీ వాయిస్ టుడే అమరావతి –––

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి