పారిశుద్ధ్య కార్మికుడుకు. కారు.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రూ.50 కూలీ నుండి ఫార్చ్యూనర్ వరకు
పారిశుధ్య కార్మికుడి అద్భుత ప్రయాణం!
పారిశుధ్య కార్మికుడు ఇలా విశాలవంతమైన కారులో వచ్చి పనిచేసి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
శేషప్పన్న 1996లో కేవలం 50 రూపాయల కూలి కోసం పౌరకార్మికుడిగా చేరాడు. కొంతకాలానికే పర్మినెంట్ ఉద్యోగి అయ్యాడు. మూడో తరగతి వరకే చదివిన శేషప్పన్న ఒకానొక దశలో మద్యానికి బానిసయ్యాడు.
2005లో బంట్వాళ్ ఎస్ఐ బెళ్ళియప్ప మాటల స్ఫూర్తితో మద్యం మానేశాడు. రోజూ మధ్యాహ్నం వరకూ పౌరకార్మికుడిగా పనిచేస్తాడు. ఆ తర్వాత పశువుల పెంపకం చూసుకుంటాడు. దీని ద్వారా నెలకు మరో రూ.40 వేలు సంపాదిస్తాడు.
ఈ క్రమంలో తొలుత ఆల్టో కారు కొన్న అతన్ని కొందరు 'పారిశుధ్య కార్మికుడికి కారు ఎందుకు..?' అని ఎగతాళి చేశారు. అయినా పట్టించుకోలేదు. కొన్నాళ్లకు స్కార్పియో కొన్నాడు. పాత కారును విక్రయించి మళ్లీ లోన్ తీసుకుని కొత్త కారు కొనడం అలవాటుగా మారింది. ప్రస్తుతం ఫార్చ్యూనర్ కారు కొనుగోలు చేశాడు.
జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. మద్యానికి బానిసై ఎన్నో కోల్పోయాను. తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసేందుకు కూడా డబ్బులు లేవు. ఏ పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు. గౌరవమే ప్రధానం. ప్రస్తుతం పౌరకార్మికుడిగా వచ్చే జీతం కాకుండా పాడి పశువుల ద్వారా నెలకు మరో రూ.40వేలు సంపాదిస్తున్నాను. నాకిష్టమైన కారులో తిరగడం సంతోషంగా ఉంది
- పౌరకార్మికుడు శేషప్పన్న
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి