అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్
అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు
ఏపీ ప్రభుత్వం నూతన పెన్షన్లు అక్టోబర్ 1 నుంచి పంపిణీ చేయనుంది.
AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఈ నెల 7 నుంచి నిన్నటి వరకు దాదాపు 13.40 లక్షల మంది అప్లై చేసుకున్నారు
ఏపీ ప్రభుత్వం నూతన పెన్షన్లు అక్టోబర్ 1 నుంచి పంపిణీ చేయనుంది.
AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఈ నెల 7 నుంచి నిన్నటి వరకు దాదాపు 13.40 లక్షల మంది అప్లై చేసుకున్నారు
వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు
చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.
వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.
అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.
ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.
- ఏపీ వాయిస్ టుడే
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి