35 వేల అడుగుల ఎత్తులో వినాయకునికి పూజ.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
గణేశ్ చతుర్థి అంటే ఇంటిల్లిపాదీ కలిసి గణనాథుణ్ణి పూజించే పండుగ. అయితే ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండే కొందరికి పండుగ రోజున కుటుంబ సభ్యులతో కలిసి గణపయ్య పూజలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ ఎయిర్ ఇండియా హోస్టెస్ కు అనుకోని విధంగా విమానంలోనే వినాయకుణ్ణి పూజించుకునే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అనురాధా సోనీ అనే కేబిన్ క్రూ మెంబర్ కు చివరి నిమిషంలో తన షెడ్యూల్ మారిపోయింది. దీంతో ఇంట్లో నిర్వహించుకునే వినాయకుడి పూజకు ఆమె హాజరు కాలేకపోయారు. తీవ్ర నిరాశకు గురైన ఆమెకు విమానంలో చోటుచేసుకున్న ఓ అనూహ్య పరిణామం ప్రత్యేకంగా నిలిచింది.
తాను విధులు నిర్వహిస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు గణేశుడి విగ్రహాన్ని తీసుకురావడంతో అనురాధ ఆనందం వ్యక్తం చేశారు. ఏకంగా 35 వేల అడుగుల ఎత్తులో గణపయ్యను పూజించే అవకాశం దక్కిందన్నారు. అనంతరం ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
విమానంలో గణపతిని పూజిస్తున్న సమయంలో తనకు ప్రత్యేకమైన అనుభూతి కలిగిందన్నారు అనురాధ. నేను ఎక్కడున్నా గణనాథుడు నాతోనే ఉన్నారన్న భావన కలిగింది. మనం అనుకున్న దానికంటే వినాయకుడు వేసే ప్రణాళిక చక్కగా ఉంటుందనిపించింది అని ఆమె భావోద్వేగం చెందారు.
AP VOICE TODAY
సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి
వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు
చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు
వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.
వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.
మానవత్వానికి మరో పేరు
అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.
ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
- ఏపీ వాయిస్ టుడే
