లంచం.. లంచం.. లంచం.. ఎన్ని సార్లు దొరికినా తీరు మారదా
లంచం... లంచం.. లంచం...
వి ఆర్ ఓ తీరు మారదా
అనకాపల్లి, ఏపీ వాయిస్ టుడే
ఏసీబీ కేసు ఉన్నా మారని తీరుతో ఓ వీఆర్వో మళ్లీ లంచం కేసులో పట్టుబడ్డాడు.
భూమి మ్యుటేషన్ కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కె.కోటపాడు (M) వారాడ వీఆర్వో జి.సూర్యనారాయణ గతంలోనూ ఇదే తరహా కేసులో పట్టుబడ్డారని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
2022లో నాతవరం మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న సమయంలో రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కారని, ఆ కేసులో చార్జిషీట్ కూడా దాఖలైందని వెల్లడించారు. తాజాగా మరోసారి లంచం తీసుకుంటూ పట్టుబడటంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి లంచగొండులను ఏసీబీ అధికారులు ఏ మాత్రం వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లంచగొండి అధికారుల భరతం పట్టేందుకు ఏపీ వాయిస్ టుడే ముందు ఉంటుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి