సుంకపూరు పంచాయతీ లో జోరుగా నూతన పెన్షన్లు అప్లికేషన్ల నమోదు.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
పెన్షన్ల నమోదులో సుంకపురు సచివాలయం ముందంజ
కోట ఉరట్ల, ఏపీ వాయిస్ టుడే :
పెన్సన్స్ కొరకు అప్లికేషన్స్ నమోదు చేయడంలో కోట ఉరట్ల మండలం సుంకపూరు సచివాలయం సిబ్బంది ముందున్నారు.
పంచాయతీ అభివృద్ధి అధికారి మధుసూదనరావు ఆధ్వర్యంలో డిజిటల్ అసిస్టెంట్, సిబ్బంది నమోదు కార్యక్రమం జోరుగా సాగిస్తున్నారు. ఎంతో మంది వృద్ధులు, వితంతువులు నిరక్షరాస్యులు కావడంతో వారికి కావాల్సిన పత్రాల గురించి ఎంతో ఓపికగా వివరిస్తూ, ఆయా పత్రాలను స్వయంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు.
అర్హులైన అందరికీ పెన్షన్లు అందేలా కృషి చేస్తున్నామని పంచాయతీ అభివృద్ధి అధికారి మధుసూదనరావు అన్నారు.
పెన్షన్లు కోసం సచివాలయానికి వచ్చే వారిని చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరిస్తూ వారికి దగ్గరుండి అప్లికేషన్ నమోదు చేయిస్తున్న పంచాయతీ అభివృద్ధి అధికారి మధుసూదనరావును, డిజిటల్ అసిస్టెంట్ ను, సిబ్బందిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి