మోడరన్ విద్యా సంస్థలో ఘణంగా వినాయక చవితి వేడుకలు.

ఏపీ వాయిస్ టుడే

ఆధ్యాత్మిక భావానికి, సామాజిక ఐక్యతకు నిదర్శనం - వినాయక చవితి పర్వదినం :- జి. వి. రావు

రామచంద్రపురం, సెప్టెంబర్ 14

రామచంద్రపురం మోడరన్ విద్యాసంస్థల ప్రాంగణంలో సోమవారం వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జి.వి.రావు, మంగాదేవి దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా మోడరన్ విద్యాసంస్థల హాస్టల్ విద్యార్థులతో కలిసి వేదపండితుల ఆధ్వర్యంలో రావు దంపతులు సాంప్రదాయబద్దంగా వినాయక చవితి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జి.వి.రావు మాట్లాడుతూ... స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాలగంగాధర తిలక్ ఈ పండుగను ఇళ్ల నుండి వీధుల్లోకి తీసుకువచ్చి కుల, మత, వర్గ భేదాలను మరిచి అందరూ ఒక్కచోట చేరే సామాజిక ఐక్యతా వేదికగా మార్చారని పేర్కొన్నారు. మండపాల్లో భక్తులు ప్రతిరోజు కలిసి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామాల్లో, వీధుల్లో స్నేహం, సహకారం పెరుగుతాయన్నారు.

వినాయక చవితి రోజు పూజకు ఉపయోగించే 21 రకాల పత్రి కేవలం ఉత్త ఆకులు కావని, అవి వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరం, చర్మ వ్యాధులను నివారించే ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేద ఆకులని రావు గుర్తు చేశారు. గరిక, జిల్లేడు, మారేడు, ఉమ్మెత్త వంటి పత్రిని తాకడం, వాటి సువాసన పీల్చడం వల్ల శరీరానికి సహజమైన ఆరోగ్య రక్షణ లభిస్తుందని పెద్దల నమ్మకమన్నారు.

తొలిపూజ అందుకునే విఘ్నేశ్వరుడిని భక్తితో పూజిస్తే ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని వివరించారు. మ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే