ఒక్క సారి ఆలోచించండి...కన్న వారికి కడుపు కోత మిగల్చకండి

బుచ్చయ్యపేటలో విషాదం - యువతీ యువకులకు ఏమవుతోంది?
సంఘటన: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెదమదీనలో బుధవారం విషాదం. ఒకే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రేవతి (16) మరియు యువకుడు కనకరాజు (21) వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.

అసలు వార్త:

యువతీ యువకులకు ఏమోవుతోంది... దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం మానవ జన్మ. పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ మానవ జన్మ ఎత్తగలిగాం.అలాంటిది ఎందుకు అర్ధాంతరంగా ప్రాణం తీసుకుంటున్నారు.
పిరికి తనమా...లేక జీవించాలంటే భయమా ? .

ఒక్క సారి ఆలోచించండి మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఇక మీరు లేరని తెలిస్తే వారి హృదయం ఎంత తల్లడిల్లి పోతుంది . ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పడుతూ వారుతిన్నా తినకపోయినా మీకు ఎలాంటి లోటూ రాకుండా చూసుకుంటున్నారు.ఎందుకు మిమ్మల్ని ఉన్నతంగా చూడాలని, మీరు మంచి ఉద్యోగాలు చేసి ఎన్నో విజయాలు సాధించాలని.. కానీ మీరేం చేస్తున్నారు వారి ఆశలు అడియాశలు చేస్తూ మంచి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకొని అందని లోకాలకు వెళ్ళిపోతున్నారు.మిమ్మల్ని కడుపు లో పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చి వెలుతున్నారు.అసలు ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు ? మీరు పిరికి వాళ్ళా? చెప్పండి.

ఎలాంటి పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది.మీ సమస్య ఎలాంటిదైనా తల్లిదండ్రులకు చెప్పండి చాలు వారే చూసుకుంటారు.ఆ సమస్య కు సరైన మార్గం చూపించి సరైన మార్గం లో నడిపిస్తారు.అంతే గాని పిరికి బందల్లా ఆత్మహత్య లకు పాల్పడవద్దు. ఎలాంటి సమస్య వచ్చినా దైర్యం గా నిలబడి ఎదురించగలిగితే ఆ సమస్యలు తోక ముడిచుకొని పోతాయి .
అర్దం చేసుకోండి యువతీ యువకులరా .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే