పిల్లల భవిష్యత్తు కు తల్లిదండ్రులే మార్గదర్శకులు...హెచ్ డబ్ల్యూ ఓ బాబు రావు

AP VOICE TODAY | GOLUGONDA

సెప్టెంబర్ 6, 2025 | గొలుగొండ | ఆదివారం

పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులే మార్గదర్శకులు

హాస్టల్ వెల్ఫేర్ అధికారి - పి. బాబురావు - ఆదర్శ అధికారి

గొలుగొండ, సెప్టెంబర్ 6 (AP VOICE TODAY): పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులే మార్గదర్శకులని వారి యొక్క అలవాట్లు, వ్యవహారశైలి పిల్లలపై ప్రభావం చూపుతుందని హాస్టల్ వెల్ఫేర్ అధికారి పి. బాబురావు అన్నారు.

ఆదివారం గొలుగొండ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - పిల్లల పట్ల తల్లిదండ్రులు సమన్వయంగా మెలగాలని, పిల్లాడి సత్ప్రవర్తన ఎలా ఉందో గమనించాలన్నారు.

ప్రభుత్వం విద్యార్థుల చదువు కోసం అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం, మంచి వెలుతురు ఇచ్చే విద్యుత్ మరియు నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందన్నారు.

విద్యార్థులు ఇంటికి వచ్చిన తరువాత చెడు స్నేహాలకి దూరంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🌟 ఆదర్శ అధికారి బాబురావు గారికి ప్రశంసలు:
విద్యార్థుల సంక్షేమం కోసం తండ్రిలా ఆలోచిస్తూ, అంకితభావంతో సేవలందిస్తున్న HWO బాబురావు గారి పనితీరు అభినందనీయం. నాణ్యమైన వసతులు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నారు.
AP VOICE TODAY | గొలుగొండ స్థానిక వార్తలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే