ప్రభుత్వ పాఠశాలలో రోబో టీచర్

ఏపీ వాయిస్ టుడే డెస్క్

ప్రభుత్వ పాఠశాలలో రోబో టీచర్.. అద్భుతంగా విద్యాబోధన!

విద్యార్థుల ప్రశ్నలకు టకటకా జవాబులు

ప్రభుత్వ పాఠశాల క్లాస్ రూమ్ లోకి టీచర్ స్థానంలో రోబో వచ్చింది. విద్యార్థులకు పాఠాలు చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పింది.

ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగింది. విద్యార్థుల డౌట్స్ ను నివృత్తి చేసింది. తరువాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు టకాటకా సమాధానాలు చెప్పింది.

ఇది చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగాత్మకంగా రోబో టీచర్ ను తీసుకొచ్చి విద్యాబోధన చేయిస్తున్నారు.

గమనిక: ఈ టెక్నాలజీని స్వాగతించాల్సి ఉన్నా... రానున్న రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళలో టీచర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే రోబో టీచర్స్ ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కారణం అతి తక్కువకే ఈ రోబో టీచర్ అందుబాటులో ఉండేలా తయారు కావడమే. ఇదే కొనసాగితే లక్షలాది మంది ప్రైవేటు స్కూళ్ళలో టీచర్స్ వీధిన పడే అవకాశం ఉంది.

- AP Voice Today

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే