అక్టోబర్ లోనే స్థానిక ఎన్నికలు. మంత్రి లోకేష్.
‘స్థానిక’ ఎన్నికలు వాయిదా పడవు: లోకేశ్
అమరావతి, సెప్టెంబర్ 23 (ఏపీ వాయిస్ టుడే):
AP: అక్టోబర్ లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. ఎన్నికలు జరగవనే అపోహలు ఎవరికీ వద్దని మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో స్పష్టం చేశారు.
ఎన్నికలు వాయిదా పడాలన్న వైసీపీ కుయుక్తులు పనిచేయవన్నారు. కోర్టులో పెండింగులో ఉన్నవి కూడా త్వరగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కూటమి పార్టీలతో పొత్తుల అంశం సమన్వయ కమిటీ, అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
- ఏపీ వాయిస్ టుడే | అమరావతి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి