కాశీ పట్నం సంతలో కూలిన బారీ వృక్షం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కాశీ పట్నం సంతలో కూలిన భారీ చింతచెట్టు.. వర్షాలు వల్ల తప్పిన పెను ప్రమాదం
అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ సమీపంలోని ఎస్ కోట అరకు ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం భారీ చింతచెట్టు కూలిపోయింది.
వారపు సంత సాయంత్రం 5 గంటలకు ముగియడంతో ఆ సమయంలో చెట్టు కింద వ్యాపారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
అదే సమయంలో వాహనాల రాకపోకలు కూడా తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గ్రామస్తులు పేర్కొన్నారు.
సంతలో వ్యాపారాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఈ భారీ చెట్టు కూలి ఉంటే వ్యాపారులు కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న ఆర్ అండ్ బి సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని రహదారిపై పడిన చెట్టును తొలగించే పనులు చేపట్టారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి