వైద్యం కోసం బాలుడుని బుజం మీద ఎక్కించుకొని నదిని దాటుతున్న గిరిజనుడు
ఏపీ వాయిస్ టుడే డెస్క్
పొంగుతున్న నదిని దాటి బాలుడిని కాపాడిన మేనమామ
అల్లూరి సీతారామరాజు జిల్లా - అనంతగిరి మండలం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల గ్రామాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు స్తంభించపోయాయి.
గురువారం అనంతగిరి మండలంలో ఒక బాలునికి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళెందుకు పొంగి ప్రవహిస్తున్న నదిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బాలుని ప్రాణమే ముఖ్యమని భావించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జోరుగా ప్రవహిస్తున్న నదిలో బాలుడిని భుజాలమీదకు ఎక్కించుకొని నదిని దాటి ఆసుపత్రికి తీసుకెళ్లాడు తన మేనమామ.
ఈ ఘటన చూసిన స్థానికులు మేనమామ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి