మాకవరపాలెం లో ఘణంగా అంగన్వాడీ కార్యక్రమం

మాకవరపాలెంలో ఘనంగా అంగన్వాడీ పండుగ

మాకవరపాలెం: మాకవరపాలెంలో అంగన్వాడీ పండుగ ఘనంగా జరిగింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రామలక్ష్మి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె ఐసీడీఎస్ ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం స్థానిక టీడీపీ నేత అల్లురాము నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. అంగన్వాడీల సేవలను గుర్తించింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. ప్రభుత్వ వైద్యాధికారి బి.శ్రీనివాస్ గర్భిణులు, బాలింతలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ ను అధికారులు, నేతలు పరిశీలించారు. అంగన్వాడీలను ఘనంగా సత్కరించారు.

పాల్గొన్నవారు: ఆర్.వి.పాత్రుడు, మర్రి నాయుడు, సీడీపీఓ రమణి, ఎంపీడీఓ ఛాయా సుధ, మేరి జోన్స్, రమేష్ తదితరులు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే