నర్సీపట్నం లో బిసీ మహాసభ విజయవంతం.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
నర్సీపట్నంలో జయహో బీసీ మహాసభకు పోటెత్తిన జనవాహిని
ఏపీ వాయిస్ టుడే, నర్సీపట్నం
నర్సీపట్నం: జయహో బీసీ సభకు పోటెత్తిన జనవాహిని
నర్సీపట్నంలో బుధవారం జయహో బీసీ మహాసభ వైభవంగా జరుగుతోంది. అశేష జనవాహిని తరలిరావడంతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది. సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా నర్సీపట్నం ఇలవేల్పు శ్రీ నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.34 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఉపయోగం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నం జయహో బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. మంచి నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తారని తెలిపారు. బీసీ నాయకులు గ్రామాలలో ప్రజలకు వివరించాలని వెల్లడించారు. 34 శాతం రిజర్వేషన్ ఇవ్వటం బీసీలకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రజలకు మేలు కలుగజేస్తుందన్నారు.గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు: చింతకాయల విజయ్
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపారని రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ అన్నారు. నర్సీపట్నంలో జరిగిన జయహో బీసీ సభలో ఆయన మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారని అన్నారు. బీసీ జీవితాలలో వెలుగు నింపిన చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు చెప్పే విధంగా మొబైల్ లైట్లు వెలిగించాలని పిలుపునిచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర, వల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు హాజరు కావడం తాము చేసుకున్న అదృష్టమన్నారు.
AP VOICE TODAY | NARSIPATNAM
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి