రావికమతం మండలం లో చక్కని వైద్యసేవలను అందిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయలలిత

ఏపీ వాయిస్ టుడే - రావికమతం

మానవత్వానికి మారుపేరు డాక్టర్ జయలలిత! - రావికమతం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర!

24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. చిరునవ్వుతో పలకరిస్తూ ప్రాణం పోస్తున్న దేవతామూర్తి!

వైద్యం అంటే కేవలం మందులు రాయడం కాదు.. ఆప్యాయంగా పలకరించి, భరోసా ఇవ్వడమని నిరూపిస్తున్నారు రావికమతం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ జయలలిత గారు.

రావికమతం మండలంలో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా "నేనున్నా" అంటూ ముందుకు వెళ్లి వైద్యం అందించడంలో డాక్టర్ జయలలిత గారు ఎల్లప్పుడూ ముందుంటారు. పగలనకా, రాత్రనకా 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అందరికీ అండగా నిలుస్తున్నారు.

చిరునవ్వే ఆమె మొదటి మందు!
ఆసుపత్రికి వచ్చిన రోగులను చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాధను సొంత బాధగా భావించి మంచి వైద్యం అందిస్తున్నారు.గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఎంతోమందికి ఉచితంగా చక్కని వైద్య సేవలను అందిస్తున్నారు.

తాజాగా రావికమతం మండలం గుమ్మాలపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 51 మంది రోగులకు స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశాలు రమణమ్మ, రమ, సంధ్య, అంగన్వాడీ టీచర్ పద్మావతి, పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వృత్తిని దైవంగా భావించి, ప్రజల ఆరోగ్యమే తన లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్ జయలలిత గారి సేవలు రావికమతం మండలంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

- ఏపీ వాయిస్ టుడే, రావికమతం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే