ప్రజల ప్రాణాలే పరమావధిగా పనిచేసిన కాశీపట్నం పంచాయతీ అభివృద్ధి అధికారిణి రమ్య
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనంతగిరి మండలం చెందిన కాశీపట్నం పంచాయతీ పరిధిలోని గోస్తనీ నది పరివాహక ప్రాంతాల్లో పంచాయతీ అభివృద్ధి అధికారిణి ఆర్ రమ్య చూపిన చొరవ ప్రశంసనీయం.
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో, పంచాయతీ అభివృద్ధి అధికారిణి ఆర్ రమ్య తన సచివాలయ సిబ్బందితో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు.
గోస్తనీ నదికి ఆనుకుని ఉన్న కాశీపట్నం, పల్లంవలస, కాటిమానువలస, సారవాణి పాలెం, సీతంపేట గ్రామాల్లో ఆమె పర్యటించారు. బుధవారం వారపు సంత కావడంతో ప్రజలు గుమిగూడిన చోట వారికి తుఫాన్ పట్ల అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి అధికారిణి ఆర్ రమ్య మాట్లాడుతూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ బయటకు రావద్దు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నదులు, వాగులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లవద్దు అని హెచ్చరిక జారీ చేశారు.
ఒక అధికారిణిగా కాకుండా ఒక కుటుంబ సభ్యురాలిగా ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులు, మహిళలు, చిన్నారుల భద్రతపై ఆరా తీయడం, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేస్తూ 24 గంటలు అందుబాటులో ఉండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలను అక్షరాలా అమలు చేస్తూ, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన అభివృద్ధి అధికారిణి రమ్య గారి పనితీరు మండలంలోని ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో వీఆర్ఓ ఎల్ బి అనిల్, మహిళా పోలీస్ ఎస్ శ్రీదేవి, హార్టికల్చర్ అసిస్టెంట్ ఏ సునీల్, డీఏ ఎస్ క్రిష్ణ, వీఆర్ఏ డి రవి తదితర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి