ఎంత తాగినా కిక్కు లేదు... అసలు గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్ అధికారులు
ఎంత తాగినా కిక్కు లేదట...ఇదీ అసలు సంగతి. గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్ అధికారులు
AP VOICE TODAY | విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లాలో మద్యం కల్తీ చేస్తున్న షాప్ లపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుదీర్ కేసులు నమోదు చేశారు.
పలు మద్యం షాపులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కాస్ట్లీ మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ కలపడం, చీప్ లిక్కర్ లో నీరు కలపడం గమనించిన ఎక్సైజ్ అధికారులు ఆయా మద్యం సీసాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుదీర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా దార్లపూడి నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ కల్తీ దందాకు తెరలేపినట్టు వ్యాపారులు తెలిపారని, ఆ వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసామన్నారు.
బాటిల్ ని బాటిల్ లానే ఉంచి చిన్న సూదితో మూత తీసి కల్తీ చేసి సేమ్ గా అమరుస్తున్నట్టు గ్రహించామన్నారు. అలాంటి సీసాలను ఎవ్వరూ పోల్చుకోలేరని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుదీర్ అన్నారు.
తాము నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ఇలాంటి కల్తీ మద్యాన్ని అరికడుతున్నామన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి