చోడవరం లో స్వర్ణాంధ్ర...స్వచ్చాంద్ర కార్యక్రమం

ఏపీ వాయిస్ టుడే - చోడవరం

చోడవరంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర స్పూర్తి.. పాత చెరువుకు పునర్వైభవం.. ఈవో గంగాధర్ గారి అద్భుత కృషికి ప్రజల నీరాజనం!

చోడవరం పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పూడికతో, చెత్తాచెదారంతో నిండిపోయిన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న పాత చెరువుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, ప్రతిష్టాత్మక "స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా ఈ చెరువు పునరుద్ధరణ పనులు ఘనంగా జరిగాయి.

ఈవో గంగాధర్ గారి నేతృత్వంలో అహర్నిశల కృషి...
ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక చోడవరం మండల ఈవో గంగాధర్ గారి కృషి ఎనలేనిది. ఆయన స్వయంగా రంగంలోకి దిగి, ఎటువంటి జంగిల్ క్లియరెన్స్ కోసం ఎదురుచూడకుండా, జెసిబిలు, ట్రాక్టర్ల సహాయంతో చెరువులో పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించి, ట్రాక్టర్ల ద్వారా దూరంగా తరలించారు. అంతేకాకుండా మెయిన్ రోడ్డు పక్కన ఉన్న డ్రైన్ అవుట్ లెట్ ను కూడా శుభ్రం చేసి, వర్షపు నీరు నేరుగా పాత చెరువులోకి వచ్చేలా మార్గం సుగమం చేశారు.ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మళ్లీ చెత్త వేయకుండా ఉండేందుకు ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలని స్వయంగా సూచించి, చెరువు పరిరక్షణకు పక్కా ప్రణాళిక రూపొందించారు.

అధికారులందరి సమిష్టి కృషి...
ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి శ్రీదేవి గారు, ఎంపీడీవో రాజు గారు, డిప్యూటీ ఎంపీడీవో అర్జున్ రావు గారు, ఆర్టీసీ సిబ్బంది, ఎన్ ఆర్ జి ఎస్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు మండల్ లెవల్ అధికారులు అందరూ పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ముఖ్యంగా ఈవో గంగాధర్ గారు చూపిన చొరవ, పట్టుదల పట్ల చోడవరం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులను కాపాడుకోవడంలో ఆయన చేస్తున్న కృషి ఇతర మండలాలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రజలు కొనియాడుతున్నారు.

- ఏపీ వాయిస్ టుడే, చోడవరం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే