భోగాపురం ఎయిర్ పోర్ట్ ఆకారంలో వినాయకుని మండపం
విశాఖలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఆకారంలో వినాయక మండపం
AP VOICE TODAY | భీమునిపట్నం - చేపలుప్పాడ
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో చేపలుప్పాడ గ్రామంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ ఆకారంలో వినాయకుని మండపాన్ని నిర్మించారు.
భీమునిపట్నం మండలం చేపలుప్పాడ గ్రామంలో స్థానిక యువకులు వినూత్నంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆకారంలో భారీ వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపం చూడటానికి ఎయిర్ పోర్ట్ లాగే ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ మండపంలో వినాయకుని పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలతో మండపం కళకళలాడుతోంది.
ఈ వినూత్న మండపాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భీమిలి, భీమునిపట్నం, విశాఖ నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ మండపం ముందు ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.
🙏 గణపతి బప్పా మోరియా 🙏
- AP VOICE TODAY భీమునిపట్నం -

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి