పిరికి బందల చర్యలు మానండి...కన్న తల్లి దండ్రులకు కడుపు కోత మిగల్చకండి
యువతీ యువకులకు ఏమోవుతోంది... దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం మానవ జన్మ. పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ మానవ జన్మ ఎత్తగలిగాం. అలాంటిది ఎందుకు అర్ధాంతరంగా ప్రాణం తీసుకుంటున్నారు.
పిరికి తనమా...లేక జీవించాలంటే భయమా ? .
ఒక్క సారి ఆలోచించండి మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఇక మీరు లేరని తెలిస్తే వారి హృదయం ఎంత తల్లడిల్లి పోతుంది . ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పడుతూ వారు తిన్నా తినకపోయినా మీకు ఎలాంటి లోటూ రాకుండా చూసుకుంటున్నారు.ఎందుకు మిమ్మల్ని ఉన్నతంగా చూడాలని, మీరు మంచి ఉద్యోగాలు చేసి ఎన్నో విజయాలు సాధించాలని.. కానీ మీరేం చేస్తున్నారు వారి ఆశలు అడియాశలు చేస్తూ మంచి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకొని అందని లోకాలకు వెళ్ళిపోతున్నారు.మిమ్మల్ని కడుపు లో పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చి వెలుతున్నారు.అసలు ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు ? మీరు పిరికి వాళ్ళా? చెప్పండి.
ఎలాంటి పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది.మీ సమస్య ఎలాంటిదైనా తల్లిదండ్రులకు చెప్పండి చాలు వారే చూసుకుంటారు.ఆ సమస్య కు సరైన మార్గం చూపించి సరైన మార్గం లో నడిపిస్తారు.అంతే గాని పిరికి బందల్లా ఆత్మహత్య లకు పాల్పడవద్దు. ఎలాంటి సమస్య వచ్చినా దైర్యం గా నిలబడి ఎదురించగలిగితే ఆ సమస్యలు తోక ముడిచుకొని పోతాయి .
అర్దం చేసుకోండి యువతీ యువకులరా .

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి