చోడవరం లో స్వచ్చ పదం

చోడవరంలో ప్రతి బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమం
ఏపీ వాయిస్ టుడే, చోడవరం - సెప్టెంబర్ 9

పట్టణంలో ప్రతి బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమం ద్వారా వీధులను శుభ్రం చేసే కార్యక్రమాలను చేపడతున్నామని ఎంపీడీఓ సన్యాసిరాజు పంచాయతీ ఈవో గంగాధర్ లు తెలియజేశారు.

బుధవారం స్థానిక ఫిషర్మెన్ కాలనీలో స్వచ్ఛ పదం కార్యక్రమం ద్వారా రోడ్లకు ఇరువైపులా ఉన్న తుప్పలను, మొక్కలను తొలగించి కాలువలో పూడికలను తీసి వేసారు. ఆ చెత్త చెదారలను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్ లకు తరలించారు.

అలాగే వార్డులో ప్రజలకు తడి పొడి చెత్తలపై అవగాహన కల్పించి ఎవరు రోడ్లపైన చెత్తను పార వేయరాదని అలా వేసిన వారి పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ప్రధానంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సంపూర్ణ ఆరోగ్య సిద్ధిస్తుందని మన పట్టణం కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలుష్యం లేని పట్టణంగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని ఈవో గంగాధర్ తెలిపారు.

ఈ స్వచ్ఛ పదం కార్యక్రమంలో ప్రజల భాగస్వాగతంతో ఏపుగా పెరిగి రహదారికి అడ్డంగా ఉన్న మొక్కల కొమ్మలను తొలగించి ఫిషర్మెన్ కాలనీ పరిశుభ్రంగా తీర్చి దిద్దడం జరిగిందని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సన్యాసిరాజు, ఈవో గంగాధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ నారాయణ, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
AP VOICE TODAY | CHODAVARAM

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే