అనంత గిరి మండలంలో పశువైద్య శిబిరాలు.
*AP VOICE TODAY | అనంతగిరి | 02-10-2026*
*పశు వైద్యాధికారి డా. సాగిరి గణేశ్వరరావు సేవలకు విశేష ప్రశంసలు*
అనంతగిరి మండలంలో పశు వైద్య సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మండల పశు వైద్యాధికారి డా. సాగిరి గణేశ్వరరావు తన అంకితభావంతో కూడిన సేవలతో రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు.
మండలంలోని రొంపల్లి, ఆర్టేపురం, పాసిని మాద్రివలస గ్రామాల్లో గురువారం నిర్వహించిన పశు వైద్య శిబిరాలు దీనికి నిదర్శనం. ఈ శిబిరాల్లో డా. గణేశ్వరరావు స్వయంగా పాల్గొని పశువులను, మేకలను పరిశీలించి నట్టల నివారణ మందులను, వ్యాధి నిరోధక టీకాలను వేశారు. పశువులకు సోకే అంటువ్యాధులపై రైతులకు చక్కటి అవగాహన కల్పించారు.
డా. గణేశ్వరరావు గారు ఒక అధికారిలా కాకుండా రైతు బిడ్డలా మమేకమవుతారని రైతులు కొనియాడుతున్నారు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరించడం, అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సలహాలు ఇవ్వడం, గిరిజన గ్రామాలకు సైతం స్వయంగా వెళ్లి వైద్య సేవలు అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. పశువుల ఆరోగ్యం పట్ల ఆయన చూపే శ్రద్ధ, రైతుల పట్ల ఆయనకున్న ఆప్యాయత మాటల్లో చెప్పలేనిది.
రైతులకు పశువులే జీవనాధారం అని గ్రహించి వాటి సంరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఇలాంటి ఉత్తమ అధికారి తమ మండలానికి ఉండటం తమ అదృష్టంగా రైతులు భావిస్తున్నారు. పశు సంపదను కాపాడటంలో డా. సాగిరి గణేశ్వరరావు గారు చేస్తున్న నిరంతర సేవలకు ప్రజల నుండి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ సందర్భంగా డా. గణేశ్వరరావు మాట్లాడుతూ పశువులకు వ్యాధులు సోకిన వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలని రైతులను కోరారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి