శివలింగం చుట్టూ మూడు నాగు పాములు
శివలింగం చుట్టూ 3 నాగుపాములు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున శివభక్తులు పరవశించిపోయారు. మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద వెలసిన విశ్వనాథ స్వామి ఆలయంలోకి మూడు నాగుపాములు వచ్చాయి. శివలింగం ఎదురుగా పడగవిప్పి నిల్చున్నాయి. కాసేపు అక్కడే ఉండటంతో భక్తులు దర్శనానికి పోటెత్తారు. కొన్ని రోజులుగా తరచూ పాములు రావడంతో ఇటీవల పూజారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో పాముల సంచారం రికార్డు కావడంతో భక్తుల్లో నమ్మకం మరింత పెరిగింది.


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి