చోడవరం లో స్వచ్చ పదం

 *AP VOICE TODAY - చోడవరం*



*స్వచ్ఛతకు కేరాఫ్ గా ఈవో గంగాధర్ - చోడవరంలో స్వచ్ఛ పదం కార్యక్రమంతో నూతన శోభ*


*పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చడంలో విశేష కృషి - ప్రజల ప్రశంసలు అందుకుంటున్న అధికారి*


*చోడవరం:* చోడవరం పట్టణాన్ని స్వచ్ఛతలో ఆదర్శంగా నిలపడంలో ఈవో గంగాధర్ గారు చేస్తున్న కృషి ఎంతైనా అభినందనీయమని ప్రజలు కొనియాడుతున్నారు. పారిశుధ్యమే తన లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న ఆయన సేవలు పట్టణ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.


ఈరోజు చోడవరం పట్టణంలో కోణం గెస్ట్ హౌస్ ఏరియాలో ఈవో గంగాధర్ గారి ఆధ్వర్యంలో "స్వచ్ఛ పదం" కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, అక్కడున్న డ్రైన్లన్నింటినీ శుభ్రం చేసి పట్టణానికి కొత్త శోభ తీసుకువచ్చారు.


అంతేకాకుండా అక్కడున్న ప్రజలకు చెత్త ఎవరూ రోడ్డు మీద వేయరాదని, తమ వద్దే ఉంచుకుని ప్రతి వారం వచ్చే స్వచ్ఛ రథానికి ఇస్తే దాని ద్వారా వచ్చే డబ్బులను తమ అవసరాలకు వాడుకోవచ్చని అవగాహన కల్పించారు. తడి చెత్తనంతా లక్ష్మీదేవి పేటలో ఉన్న SWPC షెడ్ కు పంపించి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని శానిటేషన్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.


సాధారణంగా అధికారులు కార్యాలయానికే పరిమితం అవుతుంటే, ఈవో గంగాధర్ గారు మాత్రం స్వయంగా రోడ్డుపైకి వచ్చి పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ, సిబ్బందిలో ఉత్సాహం నింపుతున్నారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఆయన ముందుచూపు, నిబద్ధత వల్లే చోడవరం పట్టణం రోజురోజుకూ పరిశుభ్రంగా మారుతోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజు గారు, ఈవో గంగాధర్ గారు మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి సమర్థుడైన అధికారి చోడవరానికి ఉండటం పట్టణ ప్రజల అదృష్టమని ప్రజలు చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మరో మదర్ థెరీసా... చింతపల్లి ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి.

కన్నీళ్లు తుడిచిన జిల్లా కలెక్టర్ నిషాంతి.. పేద మహిళకు స్పాట్ లో ఉద్యోగం.

AP VOICE TODAY


సొంత డబ్బుతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన చింతపల్లి సూపరింటెండెంట్ పద్మావతి

వర్షాకాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం, మానవత్వంతో సేవలు

చింతపల్లి గ్రామీణం: వర్షాకాలంలో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, మానవత్వంతో సేవలు అందిస్తున్న చింతపల్లి ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి పద్మావతి గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు

వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని పద్మావతి గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కప్పగొంది ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులు, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై విలువైన సూచనలు చేశారు.

వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. పసరమందు, నాటు వైద్యం చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు.

మానవత్వానికి మరో పేరు

అధికారి అంటే కేవలం ఉద్యోగం చేసేవారు కాదు, ప్రజలకు నిజమైన సేవ చేయాలనే పద్మావతి గారి ఆలోచనకు నిదర్శనంగా ఆమె తన సొంత నిధులతో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ చిన్న సహాయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు.

పద్మావతి గారి ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆమె చూపిస్తున్న చిత్తశుద్ధి, అంకితభావం నిజంగా అభినందనీయం.
ఇలాంటి అధికారులు ఉండటం చింతపల్లి ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

- ఏపీ వాయిస్ టుడే